తెలంగాణలో తెరాస పాలనపై నిత్యం నిప్పులు చెరుగుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి కేసీఆర్‌నుద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. రైతును వడ్డీ వ్యాపారికి వదిలి... కేసీఆర్ బీఆర్‌ఎస్ అంటూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. రబీలో అమ్మిన ధాన్యానికి సొమ్ములివ్వలేదని... వానాకాలం పంటకు రైతుబంధు లేదని ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. మూడు రోజుల్లో రైతుబంధు విడుదల చేయకపోతే.. రైతు పోరుకు సిద్ధమని హెచ్చరించారు.
Revanth Reddy Tweet: సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సూటి ప్రశ్నలు.. ఏంటంటే? - Revanth Reddy Tweeted to cm kcr
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తనదైన శైలిలో ట్విటర్‌లో కేసీఆర్‌నుద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని ఆరోపించారు. అప్పులు, భూముల అమ్మకం, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో వ్యాట్ ద్వారా, కరెంట్, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బస్ ఛార్జీల పెంపు, మద్యం అమ్మకాల ద్వారా జనం ముక్కుపిండి వసూలు చేస్తోన్న లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయి అంటూ ప్రశ్నించారు.
కేసీఆర్త తన రాజకీయ విన్యాసాలు ఆపి.. చిరు ఉద్యోగులైన హోం గార్డులు, మోడల్ స్కూల్స్ సిబ్బందికి తక్షణం మే నెల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షం ఆయా వర్గాలకు అండగా కాంగ్రెస్ కార్యచరణ ఉంటుందని స్పష్టం చేశారు.