Revanth Reddy React on Iphone Hack Alerts : ప్రజల హక్కులు, న్యాయం కోసం పోరాడడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రాధాన్యత అని.. పీసీసీ అధ్యక్షుడురేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. విపక్షనేతల ఐఫోన్‌లను హ్యాక్ చేస్తున్నట్లు వస్తున్న మెసేజ్‌లపై.. రేవంత్‌రెడ్డి ఎక్స్(ట్విటర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. తన ఫోన్‌కు వచ్చిన హ్యాక్ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఎక్స్‌లో పంచుకున్నారు.
Revanth Reddy fires on Hacking Inciddent :అధికార పార్టీలు స్పైవేర్‌ని ఉపయోగించి తమ ఫోన్‌లను అక్రమంగా హ్యాక్ చేస్తున్నారని(Iphone Hack Alerts) రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇది ముమ్మాటికీ వ్యక్తిగత గోప్యత, మానవ గౌరవం, రాజకీయ హక్కుల ఉల్లంఘనేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కానీ ఇవేవి తమని అడ్డుకోవని.. తమ చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల కోసం రాజీ లేకుండా పోరాడుతున్నట్లు తెలిపారు.
Opposition Leaders Received Iphone Hack Alerts : దేశవ్యాప్తంగా విపక్షనేతల ఐఫోన్లపై హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారంటూ.. యాపిల్ నుంచి తమకు వార్నింగ్ మెసేజ్‌లు వస్తున్నాయని.. పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. తమ ఫోన్లపై ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని సంబంధిత మెసేజ్‌లో ఉందన్నారు. తమ ఫోన్లు హ్యాక్‌కు గురై.. డేటా చోరీ జరిగే అవకాశం ఉందని యాపిల్ తమను హెచ్చరించిందని తెలిపారు. యాపిల్ నుంచి వచ్చిన వార్నింగ్ స్క్రీన్ షాట్లను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.