Revanth Reddy met the Governor: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో పది మంది కాంగ్రెస్ నాయకుల బృందం గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌ను కలిసి టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి పేపర్ లీక్‌పై మొత్తం వ్యవహారంలో మంత్రి కేటీఆర్ శాఖ ఉద్యోగులదే కీలకమని ఆరోపించారు.
కమిషన్‌ను రద్దు చేసే అధికారం ఉంది:వ్యాపం కుంభకోణంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని జత చేసి, దరఖాస్తు ఇచ్చినట్లు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందరిని సస్పెండ్ చేసి పారదర్శక విచారణ చేస్తుందని భావించామని...కాని ఆ దిశలో ముందుకు వెళ్లడం లేదని తెలియచేసినట్లు వివరించారు. విచారణ పూర్తయ్యే వరకు పబ్లిక్ సర్వీస్ కమిసన్‌ను రద్దు చేసే విశేష అధికారం గవర్నర్‌కు ఉందని తెలియచేసినట్లు పేర్కొన్నారు. విశేష, విచక్షణ అధికారాలు ఉపయోగించుకోవాలని తాము కోరగా....న్యాయ సలహా తీసుకుని నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ తెలిపారని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఐటీ శాఖే దీనికి కారణం:పేపర్ లీకేజీలో విచారణ ఎదుర్కోవాల్సిన ఛైర్మన్, కార్యదర్శి, సెక్షన్ ఆఫీసర్‌ను అందరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. జరిగిన అవకతవకలకు ఐటీ శాఖ కారణం. ఆ శాఖకు కేటీఆర్ మంత్రిగా ఉన్నారు. ఆ శాఖ పరిధిలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులతో చెలగాటంగా మారాయన్నారు. ఈ బాధలు భరించలేక కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని... ఇంకా కొందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారని వాపోయారు. తెలంగాణలో ఉన్న ప్రధానమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోవడం.. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లోపించడంతో ప్రభుత్వంలోని పెద్దలు అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయాలకు ప్రశ్నపత్రాలను అమ్ముకునే పరిస్థితి వచ్చిందని పీసీసీ చీఫ్ మండిపడ్డారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 317 ప్రకారం గవర్నర్ తక్షణమే లీకేజీకి పాల్పడిన వ్యక్తులందరినీ సస్పెండ్ చేయవచ్చు. కాబట్టి ఆమెకున్న విశేష విచక్షణ అధికారాలను ఉపయోగించి వాళ్లను సస్పెండ్ చేయడం ద్వారా పారదర్శకమైన విచారణకు అవకాశం కల్పించాల్సిందిగా మేము గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాము. గవర్నర్ కూడా న్యాయవ్యవస్థను పరిశీలిస్తున్నాని, మీరు ఇచ్చిన ఫిర్యాదు మీద న్యాయపరమైన సలహా తీసుకుని భవిష్యత్త్‌లో ఎటువంటి చర్యలు తీసుకోవాలో తప్పకుండా వాటిని తీసుకోవడానికి ముందుకు వస్తాను. నాకు ఎలాంటి శషభిషలు లేవని గవర్నర్ తెలిపారు. జరుగుతున్న పరిణామాలను నేను స్వయంగా, నిశితంగా గమనిస్తున్నాని తప్పకుండా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హామీ ఇచ్చారు"- రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
బోర్డు రద్దు చేయాలని గవర్నర్‌ను కలిసిన రేవంత్‌రెడ్డి ఇవీ చదవండి: