తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth reddy letter to KCR: 2 లక్షలుంటే 50వేలే భర్తీ చేస్తారా?

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖను రాశారు. సుమారు 2 లక్షల పోస్టులుంటే 50 వేలే భర్తీ చేస్తారా అని ప్రశ్నించారు. కరోనా వేళ స్టాఫ్ నర్సులను దేవుళ్లని పొగిడారు.. ప్రస్తుతం నర్సులు ప్రగతిభవన్​ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని లేఖలో వివరించారు.

Revanth reddy letter to KCR
Revanth reddy letter to KCR

By

Published : Jul 10, 2021, 2:47 PM IST

సీఎం కేసీఆర్‌కు (CM KCR) పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (PCC Chief Revanth reddy) బహిరంగ లేఖను (letter) రాశారు. 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ (biswal committee) చెప్పిందని రేవంత్‌ రెడ్డి (Revanth reddy) పేర్కొన్నారు. సుమారు 2 లక్షల పోస్టులుంటే 50 వేలే భర్తీ (recruitment) చేస్తారా అని ప్రశ్నించారు. కార్పొరేషన్లలోని ఖాళీల భర్తీపై స్పష్టత ఇవ్వండని అన్నారు. కరోనా వేళ స్టాఫ్ నర్సులను (narses) దేవుళ్లని పొగిడారు.. ప్రస్తుతం నర్సులు ప్రగతిభవన్ (pragathi bhavan)​ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని లేఖలో వివరించారు. ఉన్నపళంగా 1640 కుటుంబాలను కేసీఆర్‌(kcr) రోడ్డున పడేశారని ఆరోపించారు.

పోరాటం చేస్తా...

2018లో ఎంపికైన ఏఎన్ఎంలకు (ANM) ఇప్పటికీ పోస్టింగులు లేవని విమర్శించారు. స్టాఫ్ నర్సులను (Staff narses) విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. 2018 ఏఎన్ఎం అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలివ్వాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే నిరుద్యోగుల తరపున పోరాటం కొనసాగిస్తామని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

ఎందుకు తొలగించారంటే?

గతేడాది ఏప్రిల్​లో కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది కాలానికి ఔట్ సోర్సింగ్ (outsourcing) పద్ధతిన 1640మందిని విధుల్లోకి తీసుకుంది. మార్చి నాటికి వారి కాల పరిమితి ముగియడంతో పాటు... టీఎస్​పీఎస్సీ 2017 నోటిఫికేషన్​లో నర్సింగ్ స్టాఫ్​ భర్తీ ప్రక్రియ పూర్తి కావడంతో వారిని విధుల్లోకి తీసుకుంటూ ప్రజారోగ్యసంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా ఆస్పత్రుల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసిన వారిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

నర్సుల ఆవేదన !

దాదాపు ఏడాదిన్నర పాటు తమ ప్రాణాలను పణంగా పెట్టి నర్సులు విధులు నిర్వర్తించాం. కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలందించాం. అర్ధాంతరంగా విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేయడం సరికాదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ కాలంలో సేవలందించామంటూ ప్రభుత్వం, ప్రజలు ఎంతగానో అభినందించారని... ఇప్పుడు రోడ్డున పడేశారని ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలోనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి సీఎం కేసీఆర్​కు లేఖను రాశారు.

ABOUT THE AUTHOR

...view details