Revanth Reddy Judicial Enquiry on Power: విద్యుత్ రంగంపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చలో భాగంగా 'న్యాయ విచారణ జరపాలన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) స్వీకరించారు. విద్యుత్ రంగాన్ని పూర్తిస్థాయిలో స్కాన్ చేసి సభ ముందుంచామని బీఆర్ఎస్ సర్కార్ తప్పులు అవగాహన రాహిత్యంతో జరిగాయా? ఉద్దేశపూర్వకమా అనేది విచారణలో తేలుతుందన్నారు.
Revanth Reddy Speech Today: అత్యవసరమంటూ టెండర్లు లేకుండానే చత్తీస్‌గఢ్‌తో గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఓ అధికారి వాస్తవాలు చెబితే హోదా తగ్గించి మారుమూల ప్రాంతానికి పంపించారని విమర్శించారు. ఛత్తీష్‌ఘఢ్ ఒప్పందం(Chhattisgarh Agreement) వల్ల ప్రభుత్వంపై అధిక భారం పడిందని పేర్కొన్నారు. 1000 మెగా వాట్ల విద్యుత్‌లో జరిగిన కుంభకోణం విచారణలో బయటకి తీస్తామని అన్నారు.
విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట, గజ్వేల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి : సీఎం రేవంత్ రెడ్డి
"విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను ముందు పెట్టాం. విద్యుత్ శాఖపై విచారణకు ఆదేశించండి మేము సిద్దంగా ఉన్నామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రభుత్వానికి విసిరిన సవాలును స్వాగతిస్తున్నాం. మూడు అంశాల మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాం. భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్‌ను రెండు సంవత్సరాల్లో చేస్తానని, ఏడు సంవత్సరాలు తీసుకున్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్‌ను కూడా 24 గంటల్లో పూర్తి చేస్తామని ఇప్పటివరకు ముగించలేదు. 8 సంవత్సరాలు అయిన పూర్తికాలేదు. 2024-25లో పూర్తి చేయవచ్చని అంటున్నారు."- రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి