తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా కేసుల్లానే పార్టీ ఫిరాయింపులు: రేవంత్​రెడ్డి'

తెలంగాణలో కరోనా కేసుల్లానే నిజామాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపులు పెరుగుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్​ బుద్ధభవన్​లో రేవంత్​ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్​ అలీ తదితర నాయకులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్​ గోయల్​కు ఫిర్యాదు చేశారు.

'కరోనా కేసుల్లానే పార్టీ పిరాయింపులు పెరుగుతున్నాయి'
'కరోనా కేసుల్లానే పార్టీ పిరాయింపులు పెరుగుతున్నాయి'

By

Published : May 22, 2020, 5:15 PM IST

'కరోనా కేసుల్లానే పార్టీ ఫిరాయింపులు: రేవంత్​రెడ్డి'

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లే నిజామాబాద్​లో పార్టీ ఫిరాయింపులు పెరుగుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్​ బుద్ధభవన్​లో రేవంత్​ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్​ అలీ తదితర నాయకులు శశాంక్​ గోయల్​కు ఫిర్యాదు చేశారు.

"గత రెండు నెలలుగా పట్టిపీడిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విఫలమైంది కానీ.. పార్టీ ఫిరాయింపుల్లో కాదు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లే పార్టీ ఫిరాయింపులు పెరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ .. ఇతర పార్టీల స్థానిక ప్రజా ప్రతి నిధులను ప్రలోభాలకు గురి చేసి.. తెరాస పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంది."

-రేవంత్​ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ

ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక

ABOUT THE AUTHOR

...view details