Revanth On Home Guard Ravinder Death :ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు రవీందర్(Home Guard Ravinder) మృతి పట్ల పలు రాజకీయ పార్టీలు స్పందించాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరని ప్రార్థించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేఏ పాల్, సీపీఐ నేతలు సంఘీభావం తెలిపారు. రవీందర్‌ది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు.
Revanth Reddy Meets DGP Anjani Kumar : హోంగార్డు రవీందర్‌ని రాష్ట్ర ప్రభుత్వమే హత్య చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రవీందర్ మృతి కేసును డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కేసీఆర్‌పై హత్యానేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు. హోంగార్డులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని.. దివాళా తీయడానికి కేసీఆర్‌నే కారణమని దుయ్యబట్టారు. రవీందర్ పిల్లల చదువుల ఖర్చు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.. రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Hyderabad Home Guard Suicide Update : జీతం రాలేదని ఆత్మహత్యకు పాల్పడిన హోంగార్డు.. పరిస్థితి విషమం
Kishan Reddy On Home Guard Death :హోంగార్డు రవీందర్ ఆత్మహత్య(Home Guard Ravinder Suicide) ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan reddy) ఒక ప్రకటనను విడుదల చేశారు. హోంగార్డు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. హోంగార్డులకు కనీస ఆత్మగౌరవాన్ని కూడా ఇవ్వకుండా.. వేధిస్తున్న బీఆర్ఎస్ సర్కారు తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావని పోరాడి సాధించుకుందాం తప్ప.. ఆత్మహత్యలు చేసుకోవద్దని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Bandi Sanjay On Home Guard Deah : హోంగార్డు రవీందర్ మరణం అత్యంత విషాదకరమని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. రవీందర్ చావుకు కారణం కేసీఆర్ సర్కారేనన్నారు. సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ దృశ్యాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రవీందర్‌ను వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతోపాటు వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని రవీందర్ కుటుంబాన్ని పరామర్శించారు. సీపీఐ నాయకులు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి అతడి మృతి పట్ల సంతాపం తెలిపారు.
Three Persons Died in Wall Collapse in Hyderabad : కూలిన గోడ.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
Home Guard Ravinder Passed Away : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హోంగార్డు రవీందర్ మృతి