హైదరాబాద్ నగరానికి భారీ మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ రాబోతుంది. బీరుట్లో ఘటన తర్వాత ఈ తరలింపు అంశంపై ప్రజల్లో భయం ఏర్పడింది. దీని గురించి భయపడాల్సిన అవసరమేమీ లేదని పెట్రోలియం ఎక్స్‌ప్లోసివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ మాజీ అధికారి జీ.ఎం.రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ ప్రజల భయాందోళనపై నిపుణులు ఏం చెప్పారంటే? - ఎక్స్‌ప్లోసివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ మాజీ అధికారి వార్తలు
అమ్మోనియం నైట్రేట్ కొనుగోలు, దిగుమతి నిరంతర ప్రక్రియ అని పెట్రోలియం ఎక్స్‌ప్లోసివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ మాజీ అధికారి జీ.ఎం.రెడ్డి పేర్కొన్నారు. బీరుట్లో అమ్మోనియం నైట్రేట్‌తో పాటు వేరే రసాయానాలు కలిసి ఉండొచ్చని ఆయన తెలిపారు.
'ఇది నిరంతర ప్రక్రియ... జాగ్రత్తలు తీసుకుంటే ఏమికాదు'
బీరుట్లో జరిగిన ప్రమాదానికి.. రసాయనంతో వేరే పదార్థం కలిసి ఉండొచ్చని.. పోర్టుల్లో ఈ రసాయనాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచరాదని ఆయన తెలిపారు. గనులు, ఎరువుల తయరీ కంపెనీలు ఎక్కువగా వాడే ఈ రసాయనం కొనుగోలు, దిగుమతి నిరంతర ప్రక్రియ అంటున్న జీ.ఎం.రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇదీ చూడండి: 'అమ్మోనియం నైట్రేట్ తరలింపు సర్వ సాధారణంగా జరిగేదే'
Last Updated : Aug 11, 2020, 6:47 PM IST