ఎల్టీటీ ముంబయి ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మార్చి 13 నుంచి విశాఖ-చెన్నై సెంట్రల్ స్పెషల్ రైలు.. తాడేపల్లిగూడెం, తెనాలి స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది. చెన్నై సెంట్రల్- విశాఖపట్నం ప్రత్యేక రైలు.. తెనాలి వద్ద ఆగనుందని పేర్కొంది.
పునః ప్రారంభమైన ఎల్టీటీ ముంబయి ప్రత్యేక రైళ్లు - చెన్నై సెంట్రల్- విశాఖపట్నం
కన్యాకుమారి, హౌరా, గౌహతిలకు ప్రత్యేక రైళ్లను ప్రారంభించినట్లు ప్రకటించింది భారతీయ రైల్వే. దాంతో పాటుగా.. పలు రైళ్లను డైవర్ట్ చేస్తోన్నట్లు పేర్కొంది. ఇందులో ఏపీలోని విశాఖపట్నం నుంచి వెళ్లే రైలు కూడా ఉంది.
పునః ప్రారంభమైన ఎల్టీటీ ముంబయి ప్రత్యేక రైళ్లు
తిరుపతి-భువనేశ్వర్ రైలు మే 30 నుంచి రేణిగుంట స్టేషన్లో ఆగబోదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. అంతేకాక కన్యాకుమారి, హౌరా, గౌహతిలకు ప్రత్యేక రైళ్లను ప్రారంభించినట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి:'మమతకు గాయం'పై ఈసీకి పోటాపోటీగా ఫిర్యాదులు