తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ ఆహారం తీసుకుంటే మెరుగైన జ్ఞాపకశక్తి, తెలివితేటలు..! - రష్‌ మెడికల్‌ కాలేజీ పరిశోధకుల వార్తలు

ఆహార ప్రియులు మంచి ఆహారంతోపాటు జంక్‌ఫుడ్​ను లోపల వేసేస్తుంటారు. దానివల్ల వచ్చే నష్టాలను మాత్రం పట్టించుకోరు. అయితే ఎంత మంచి ఆహారం తీసుకున్నా దాంతో జంక్‌ఫుడ్ కలిస్తే వచ్చే లాభం అంతంత మాత్రమే అంటున్నారు రష్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన పరిశోధకులు. ఇంతకీ వారి పరిశోధనల్లో ఏం తేలిందో తెలుసుకుందామా..?

Researchers at the Rush Medical College says the food for better memory and intelligence
ఆ ఆహారం తీసుకున్నవాళ్లలో జ్ఞాపకశక్తి, తెలివితేటలూ..

By

Published : Jan 31, 2021, 12:36 PM IST

చాలామంది రోజూ పండ్లు, కూరగాయలు, చేపలు, ముడిధాన్యాలూ.. వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. అదే సమయంలో వాటితోపాటు ప్రాసెస్డ్‌ ఆహారం, స్వీట్లు, మాంసాహారాన్నీ తింటుంటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారంతో వచ్చే లాభాలూ తగ్గిపోతాయి అంటున్నారు రష్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన పరిశోధకులు.

అదెలా అంటే మధ్యధరా తీరానికి చెందిన ఆహారం అన్నింటికన్నా ఆరోగ్యకరమైనదనీ, అది తినేవాళ్లలో అల్జీమర్స్‌ వంటి సమస్యలూ తక్కువగా ఉంటున్నట్లు గత పరిశోధనల్లో స్పష్టమైంది. అందుకే 65 ఏళ్ల వయసు దాటిన వాళ్లని ఎంపిక చేసి వాళ్లలో అచ్చంగా మధ్యధరా ఆహారాన్ని తినేవాళ్లనీ, వాటితోపాటు జంక్‌ఫుడ్ తీసుకునేవాళ్లని విభజించారట.

రెండు రకాల ఆహారాన్ని తినేవాళ్లతో పోలిస్తే అచ్చంగా మధ్యధరా తీరానికి చెందిన‌ ఆహారం తీసుకున్నవాళ్లలో జ్ఞాపకశక్తి, తెలివితేటలూ మెరుగ్గా ఉన్నాయని అల్జీమర్స్‌ వంటి సమస్యలు తలెత్తలేదని గుర్తించారు. దీన్ని బట్టి ఎంత మంచి ఆహారం తీసుకున్నా దాంతో జంక్‌ఫుడ్ కలిస్తే వచ్చే లాభం అంతంత మాత్రమే అన్నది మర్చిపోకండి.

ఇదీ చూడండి: అడవుల జిల్లాకు రైల్వే భరోసా ఏది?

ABOUT THE AUTHOR

...view details