హైదరాబాద్ నల్లగండ్ల చెరువులో ప్రమాదవశాత్తు ఓ జింక పడింది. మునిగిపోతున్న జింకను చూసిన జీహెచ్ఎంసీ లేక్ సంరక్షణ సిబ్బంది కాపాడి గట్టకు తీసుకొచ్చారు. సిబ్బంది చెరువులోకి దిగి తాళ్ల సహాయంతో బయటకు తీసి.. జింకను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. జింకను కాపాడిన లేక్ ప్రొటెక్షన్ సిబ్బందిని జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ డైరెక్టర్ విశ్వజిత్ అభినందించారు.
జింకను కాపాడిన లేక్ సంరక్షణ సిబ్బంది - deer
చెరువులో పడిన జింకను కాపాడారు జీహెచ్ఎంసీ లేక్ సంరక్షణ సిబ్బంది. హైదరాబాద్ నల్లగండ్ల పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన జింక ప్రమాదవశాత్తు చెరువులో పడింది. గమనించిన సిబ్బంది బయటకు తీశారు.
జింకతో సిబ్బంది