తెలంగాణవ్యాప్తంగా కార్పొరేట్, 240 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ వైద్య సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు యాజమాన్య సంస్థలు ప్రకటించాయి. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు సమావేశమయ్యారు.
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల డిమాండ్లు ఇవే...
@ పెండింగ్ బకాయిలు తక్షణం విడుదల చేయాలి
@ ఆరోగ్యశ్రీ బిల్‌ను గ్రీన్ ఛానెల్లో చేర్చాలి
@ ఆరోగ్యశ్రీ ఎంఓయూని రివైజ్ చేయాలి
@ ప్రస్తుత ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు ఇతర మెడికల్ బిల్స్‌కి సంబంధించిన నిధులు పెంచాలి