.
'ఒక్క పెయిడ్ ఆర్టిస్టు ఉన్నా ఉద్యమం ఆపేస్తాం' - వెలగపూడిలో ముగ్గులతో నిరసన
ఆంధ్రప్రదేశ్లో రాజధానిపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరు జిల్లా వెలగపూడిలో రైతులు ఆందోళనకు దిగారు. వరుసగా 16వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రాజధానిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వెలగపూడిలో రాజధానిపై రైతులు నిర్వహిస్తున్న దీక్ష 16వ రోజుకు చేరుకుంది. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్న ప్రజలు "సేవ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్" అని ముగ్గులు వేసి నిరసన తెలిపారు. రాజధానిని అక్కడే ఉంచాలంటూ...దిష్టిబొమ్మలతో ఆందోళన చేశారు. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమను పెయిడ్ ఆర్టిస్టులని అంటున్న మంత్రులు.. ఆ మాటలను నిరూపించాలని సవాల్ విసిరారు. ఒక్క పెయిడ్ ఆర్టిస్టు ఉన్నా ఉద్యమాన్ని ఆపేస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: 'మా' లో మళ్లీ విభేదాలు.. రాజశేఖర్ 'చిరు' గొడవ!