తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్రి కోర్సుల ప్రవేశాలకు అర్హతల సడలింపు - agri courses

ఈ ఏడాది నుంచి పలు డిప్లొమా కోర్సులకు.. ప్రవేశాల అర్హతల్లో సడలింపులు చేసినట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంది. ఇంతకు ముందు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో నాలుగేళ్లపాటు చదివిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తుండగా.. ఇక మీదట 60 శాతం గ్రామీణ విద్యార్థులు, 40 శాతం గ్రామీణ, పట్టణ విద్యార్థులతో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్‌.సుధీర్‌ కుమార్ తెలిపారు.

university
university

By

Published : May 26, 2021, 4:42 PM IST

వ్యవసాయ, అగ్రి ఇంజినీరింగ్, ఆర్గానిక్ డిప్లోమా కోర్సులకు.. ప్రవేశాల అర్హతల్లో సడలింపులు చేసినట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఆ మేరకు అకాడమిక్ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్‌.సుధీర్‌ కుమార్ వెల్లడించారు. ఇంతకు ముందు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో నాలుగేళ్ల పాటు చదివిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తుండగా.. ఇక మీదట 60 శాతం గ్రామీణ విద్యార్థులు, 40 శాతం గ్రామీణ, పట్టణ విద్యార్థులతో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

పాలిసెట్‌లో పొందిన ర్యాంకుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు జరపనున్న దృష్ట్యా.. నాలుగేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు మాత్రమే గ్రామీణ కోటాకు అర్హులు. అలాగే, గతంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు కాగా.. ఇక నుంచి ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు పాలిసెట్‌లో ర్యాంకు పొంది మెరిట్ సాధిస్తే.. డిప్లొమాలో ప్రవేశాలను కల్పించాలని నిర్ణయించారు. అయితే వయో నిబంధనలలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

15 నుంచి 22 ఏళ్ల లోపు వయసున్న విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులు కాగా.. పాలిసెట్‌-2021 ర్యాంకుల ఆధారంగా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో.. వ్యవసాయ, అగ్రి ఇంజినీరింగ్, ఆర్గానిక్ పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఖాళీ ప్లాట్లలో పంటల సాగు.. నగరసేద్యంలో ఆదర్శం

ABOUT THE AUTHOR

...view details