రాష్ట్రంలో కొత్తగా 2,579 కరోనా కేసులు నమోదు - Record level corona tests in Telangana
08:38 August 25
రాష్ట్రంలో కొత్తగా 2,579 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2 వేల 579 కేసులు నమోదయినట్లు వైద్యరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మెుత్తం కేసుల సంఖ్య లక్ష 8వేల 670కి చేరింది. వైరస్ బారిన పడి మరో 9 మంది మృతి చెందినట్లు తెలిపింది. కొవిడ్ నుంచి కోలుకుని 1752 మంది డిశ్చార్జి అయినట్లు పేర్కొంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 295 మందికి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించింది. రంగారెడ్డి జిల్లాలో 186, ఖమ్మంలో 161, వరంగల్ అర్బన్‌జిల్లాలో 143, నిజామాబాద్‌లో 142, నల్గొండలో 129, కరీంనగర్‌లో 116, మల్కాజ్ గిరిలో 106, మంచిర్యాలలో 104, జగిత్యాలలో 98, సిద్దిపేటలో 92, పెద్దపల్లిలో 85, భద్రాద్రి కొత్తగూడెంలో 83, మహబూబాబాద్‌లో 81, సూర్యాపేటలో 78, మహబూబ్‌నగర్‌లో 69, కామారెడ్డిలో 64 ,రాజన్న సిరిసిల్లలో 59, వనపర్తిలో 56 మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో అత్యధిక సంఖ్యలో 52 వేల 933 మందికి పరీక్షలు చేసినట్లు వైద్యరోగ్య శాఖ తెలిపింది.