తెలంగాణ

telangana

ETV Bharat / state

రవిప్రకాశ్​ బెయిల్​ పిటిషన్​ విచారణ మళ్లీ వాయిదా - RAVIPRAKASH

ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కేసు విచారణ ముగిసింది. మంగళవారం ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రెండు రోజులకు వాయిదా వేసింది.

రవిప్రకాశ్​ బెయిల్​ పిటిషన్​ విచారణ మళ్లీ వాయిదా

By

Published : Jun 18, 2019, 4:25 PM IST

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటీషన్​పై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ జారీ చేయాల్సిందిగా రవిప్రకాశ్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అహ్లువాలియా వాదించారు. రవిప్రకాశ్​పై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు బనాయించారని తెలిపారు. శివాజీ, రవిప్రకాశ్ మధ్య జరిగిన షేర్ల లావాదేవీలు నిజమేనని డైరెక్టర్ల నియామకానికి సంబంధించి రవిప్రకాశ్ ఎలాంటి ఆటంకాలు కలిగించలేదని వెల్లడించారు.

మళ్లీ వాయిదా...

టీవీ9 లోగో విక్రయానికి సంబంధించి రవిప్రకాశ్​కు పూర్తి హక్కులున్నాయనే వాదనను ఆయన వినిపించారు. ఎన్సీఎల్టీలోనూ ఏబీసీఎల్ యాజమాన్య బదిలీకి సంబంధించి కేసు నడుస్తోందని అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కొత్త యాజమాన్యం సంస్థను చేతుల్లోకి తీసుకుందని అహ్లువాలియా లేవనెత్తారు. టీవీ9 కొనుగోలుకు నల్లధనం ఉపయోగించారని రవిప్రకాశ్ చెప్పడం పూర్తిగా అబద్ధమని 500కోట్ల రూపాయలను బ్యాంకు ద్వారా చెల్లింపులు చేశారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రెండు రోజులకు వాయిదా వేసింది.

ఇవీచూడండి:టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్​పై మరో ఫిర్యాదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details