కరోనా కారణంగా మూగబోయిన జాతీయ వేదిక రవీంద్రభారతి తిరిగి పునఃప్రారంభం కానుంది. ఈ ఉదయం 10 గంటలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించనున్నారని సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇక నుంచి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణ వాగ్గేయకారుల వైభవం పేరిట ఇవాళ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
నేడు రవీంద్రభారతి పునఃప్రారంభం - Hyderabad latest news
జాతీయ వేదిక రవీంద్రభారతి తిరిగి పునఃప్రారంభం కానుంది. ఈ ఉదయం 10 గంటలకు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇక నుంచి అన్నిసాంస్కృతిక కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించనున్నారు.
నేడే రవీంద్రభారతి పునఃప్రారంభం
ప్రేక్షకులు మాస్కులు, భౌతిక దూరం తప్పనిసారిగా పాటించాలని సూచించారు. అన్ని చర్యలు తీసుకున్నప్పటికి వీక్షకుల సహకారం చాలా అవసరమన్నారు. కరోనా నిబంధనలతోపాటు అధికారులకు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి:కేసీఆర్‌తోనే కళలకు, కుల వృత్తులకు పూర్వ వైభవం: శ్రీనివాస్ గౌడ్