తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలికపై అత్యాచారయత్నం.. నిందితులకు దేహశుద్ధి

సినిమా చూపిస్తామంటూ... ఓ మైనర్​ బాలికపై ఇద్దరు కిరాతకులు అత్యాచారయత్నం చేశారు. బాలిక అరుపులు విన్న స్థానికులు నిందితులకు బడితె పూజ చేశారు.

బాలికపై అత్యాచారయత్నం

By

Published : Jul 21, 2019, 6:06 PM IST

హైదరాబాద్​లోని సైదాబాద్ పోలీస్​స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పదకొండేళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారయత్నం చేశారు. ఓ బూత్​బంగ్లాలో అత్యాచారానికి యత్నించగా అమ్మాయి కేకలు వేయడం వల్ల చుట్టుపక్కల వారు వచ్చి యువకులను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

సింగరేణి కాలనీకి చెందిన జైరాం, పద్మలకు ఇద్దరు సంతానం. జైరాం 6 సంవత్సరాల క్రితమే చనిపోగా... అప్పటినుంచి పద్మ మతిస్తిమితం సరిగ్గా లేదు. వారి సంతానమైన అబ్బాయి చార్మినార్ దగ్గరలో ఉన్న హాస్టల్లో చదువుతుండగా బాధిత బాలిక నాలుగో తరగతి చదువుకుంటోంది. బాలిక ఆదివారం కావడం వల్ల సింగరేణి కాలనీలో నివాసం ఉండే పెద్దమ్మ వద్దకు వచ్చింది. గుడిసె ముందు ఆడుకుంటున్న మైనర్ బాలికకు థియేటర్​లో సినిమా చూపిస్తామని మాయమాటలు చెప్పి కేతావత్ మోతిలాల్, దస్త్రూలు బండిపై తీసుకెళ్లారు. మార్గమధ్యలో ఓ పురాతన బంగ్లాలోకి తీసుకెళ్లి అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాలిక అరుపులు విన్న స్థానికులు వారిని పట్టుకుని చితకబాదారు. సంఘటన స్థలానికి చేరుకున్న సైదాబాద్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బాలికపై అత్యాచారయత్నం

ఇవీ చూడండి: శివసత్తుల పూనకాలతో హోరెత్తిన ఉజ్జయినీ

ABOUT THE AUTHOR

...view details