తెలంగాణ

telangana

ETV Bharat / state

Sahitya Academy Award: రామచంద్రరావుకు సాహిత్య అకాడమీ పురస్కారం ప్రదానం - రంగనాథ రామచంద్రరావుకు పురస్కారం

Sahitya academy award to ramachandra rao: సాహితీవేత్త రంగనాథ రామచంద్రరావు 2020 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. గురువారం రోజు దిల్లీలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ ఛైర్మన్‌ చంద్రశేఖర కంబార చేతుల మీదుగా ఆయన జ్ఞాపిక, పురస్కారం స్వీకరించారు. ప్రముఖ కన్నడ రచయిత శాంతినాథ్‌ దేశాయ్‌ రచించిన ‘ఓం నమో’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించడంతో రామచంద్రరావుకు ఈ పురస్కారం దక్కింది.

Sahitya Academy Award
సాహిత్య అకాడమీ పురస్కారం

By

Published : Jan 1, 2022, 12:25 PM IST

Sahitya academy to ramachandra rao: ఆంధ్రప్రదేశ్​లోనిత కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన సాహితీవేత్త రంగనాథ రామచంద్రరావు 2020వ సంవత్సరానికి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2020) అందుకున్నారు. గురువారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ ఛైర్మన్‌ చంద్రశేఖర కంబార చేతుల మీదుగా ఆయన జ్ఞాపిక, పురస్కారం స్వీకరించారు. ప్రముఖ కన్నడ రచయిత శాంతినాథ్‌ దేశాయ్‌ రచించిన ‘ఓం నమో’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించడంతో ఆ విభాగంలో రామచంద్రరావుకు గతంలో పురస్కారం ప్రకటించారు.

ఆదోని పురపాలక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. 350 వరకు కథలు, నవలలు తెలుగులోకి అనువదించారు. పురస్కారం అందుకోవటం సంతోషంగా ఉందని రామచంద్రరావు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అనువాదాలు చేయాలన్న ఆశయం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:బాలయ్య కొత్త సినిమా డైలాగ్​ లీక్ చేసిన డైరెక్టర్

ABOUT THE AUTHOR

...view details