ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి... రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు రూ. 20 కోట్ల భారీ విరాళం అందించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 10 కోట్ల చొప్పున విరాళం ఇచ్చారు. కరోనా వల్ల దేశవ్యాప్తంగా జన జీవనం స్తంభించిపోయిన వేళ... ప్రజా చైతన్యం కోసం వార్తా మాధ్యమాలైన ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ యథాశక్తిగా కృషి చేస్తున్నాయి. తెలుగు వారికి ఆర్థికంగానూ కొంత చేదోడుగా నిలిచేందుకు ఈ డబ్బును ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి పంపించారు.
కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం - రామోజీరావు విరాళం
ప్రజలు, ప్రభుత్వాలకు సాయం అందించడంలో రామోజీ గ్రూపు సంస్థలు ఎప్పుడూ ముందుంటాయి. ఇంతకుముందు కేరళ వరద బాధితులకు ఇళ్లు కట్టిచ్చి తమ ఉదారత చాటుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి తమ వంతుగా సాయం ప్రకటించారు రామోజీరావు. తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 10 కోట్ల చొప్పున మొత్తం 20 కోట్లు విరాళంగా ఇచ్చారు.
ramoji rao
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను నేరుగా కలిసి ఇవ్వడానికి సంచార నిషేధం ఉన్నందన.. ఆన్ లైన్లో సొమ్మును బదిలీ చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధుల ఖాతాల్లో... ఇవాళ చెరో 10 కోట్ల రూపాయల చొప్పున ఆర్టీజీఎస్ ద్వారా జమ చేశారు. కరోనాపై పోరులో ప్రజలు విజయం సాధించాలని రామోజీరావు ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:ఇవాళ ఒక్కరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు
Last Updated : Apr 1, 2020, 9:27 AM IST