ధగధగ మెరిసే ఎంబ్రాయిడరీ దుస్తుల్లో మోడల్స్ తళుక్కుమన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ వస్త్రదుకాణం నిర్వాహకులు ఘరారా ఫెస్టివల్ పేరిట సరికొత్త కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. మోడల్స్‌తో ప్రత్యేక ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20 మంది మోడల్స్ వివిధ రకాలైన వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై వయ్యారంగా హంస నడకలు వేస్తూ.... ఆట్టుకున్నారు. రంజాన్ మాసంలో అందరికి అందుబాటులో ఉండే విధంగా సరికొత్త కలెక్షన్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజర్ ప్రియాకుమార్ తెలిపారు.
హంస నడకలతో ఆకట్టుకున్న మోడళ్లు - హంస నడకలతో ఆకట్టుకున్న మోడళ్లు
రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఓ వస్త్ర దుకాణంలో మోడల్స్ వివిధ రకాలైన వస్త్రాలను ధరించి వయ్యారంగా నడుస్తూ... ఆకట్టుకున్నారు.
హంస నడకలతో ఆకట్టుకున్న మోడళ్లు
Last Updated : May 30, 2019, 7:47 AM IST