రాణిగంజ్ డిపోనకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. రాణిగంజ్ డిపో నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ సమ్మె 42 రోజులకు చేరుకోవడం వల్ల ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఇంకా చర్చలకు పిలవకపోవడం శోచనీయమని కార్మిక నాయకులు మండిపడ్డారు. వెంటనే చర్చలకు పిలిచి తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రోజుకొక ఆర్టీసీ కార్మికుడు చనిపోతున్నా.. ప్రభుత్వంలో చలనం రాకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
రాణిగంజ్ డిపో నుంచి ప్యారడైజ్ వరకు ర్యాలీ - రాణిగంజ్ ఆర్టీసీ కార్మికుల ర్యాలీ
ఆర్టీసీ కార్మికులు రాణిగంజ్ డిపో నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు.
ఆర్టీసీ కార్మికుల ర్యాలీ