పుల్వామాలో ముష్కరదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్ అంబర్‌పేటలోని తజ్వీదుల్ ఖురాన్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, మదర్సా సిబ్బంది పాల్గొన్నారు. జై జవాన్-జైహింద్ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు. భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని కుట్రలు పన్నినా జవాన్లు సమైక్యంగా తిప్పి కొడతారని పేర్కొన్నారు. ఉగ్రవాదుల కుట్రలు తిప్పికొట్టేందుకు అంతా నడుం బిగించాలని మదర్సా నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఉగ్రకుట్రలు తిప్పి కొడదాం - jai jawan
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మదర్సా నిర్వాహకులు భారీ ర్యాలీ తీశారు. జై జవాన్.. జైహింద్ నినాదాలు చేస్తూ అమరవీరులకు నివాళులు అర్పించారు.
మదర్సా నిర్వాహకుల ర్యాలీ
ఇవీ చదవండి:ఒళ్లంతా పచ్చబొట్లతో దేశభక్తి