Raksha Bandhan Telangana 2023 :సోదర, సోదరీమణుల మధ్య.. ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండగ. రాఖీ పౌర్ణమిపురస్కరించుకుని.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును కలిసేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు రక్షా బంధన్ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రభుత్వం ఎప్పుడు మహిళలకు అండగా ఉంటుందని, వారి భద్రత, రక్షణ, సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని హరీశ్ రావు తెలిపారు.
Rakhi Pournami Telangana 2023 :మరోవైపు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్లారెడ్డి సోదరీమణులు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు తినిపించారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి శోభ సంతరించుకుంది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి.. నియోజకవర్గంలో మహిళలు తరలివచ్చి రాఖీ కట్టారు.
Raksha Bandhan Gift Ideas : రాఖీ పండక్కి గిఫ్ట్ కొనాలా..? కేవలం 100 రూపాయల్లో బెస్ట్ ఐడియాస్!
MLC Kavitha Rakhi Wishes to KTR :మరోవైపు ఎమ్మెల్సీ కవిత తన సోదరులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ‘అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం నా “ అన్న ” అని ట్విటర్ ఖాతాలో పోస్టు పెట్టారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరోవైపు కవిత.. తన సోదరుడు, ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్‌కు రాఖీ కట్టారు. రాఖీ సోదరిణుల ప్రేమకు చిహ్నమని ఎంపీ సంతోశ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ కవితతో పాటు తన సోదరి సౌమ్య.. తనకు రాఖీ కడుతున్న ఫొటోను ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
MLA Seethakka Ties Rakhi To Revanth Reddy : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి.. ములుగు ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టి సోదరప్రేమను చాటుకున్నారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి... పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదం తీసుకున్నారు.