తెలంగాణ

telangana

ETV Bharat / state

Rakhi Celebrations Telangana 2023 : తెలంగాణలో 'రాఖీ' సంబురం.. అండగా ఉంటానని అన్నయ్య భరోసా.. పుట్టిళ్లు బాగుండాలని ఆడపడుచు కోరిక - warangal news

Rakhi Celebrations Telangana 2023 : సోదర, సోదరీమణలు అనుబందానికి ఆత్మీయ ప్రతీక. పుట్టినిళ్లు బాగుండాలని కోరుకునే ఆడపడుచూ.. ఆపదల వేళ అండగా ఉంటానని అన్నయ్య ఇచ్చే భరోసాకు గీతిక. ప్రతి ఇంటా ఆప్యాయతలు పెంపొందించే వేడుక. రక్త సంబంధాల గొప్పతనాన్నిచాటిచెప్పే రాఖీ పండగ సంబురాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్నాయి.

Rakhi Celebrations
Rakhi Celebrations in Telangana

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 9:35 AM IST

Rakhi Celebrations in Telangana రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రాఖీ పండుగ సంబురాలు.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు

Rakhi Celebrations Telangana 2023 : ఒక కొమ్మన పూచిన పూవుల్లాంటి అన్నా చెళ్లెల్లు, అక్కా తమ్ముల్లు ఆనందంతో జరుపుకునేది రాఖీ వేడుక. ఆత్మీయ సోదరులకు బొట్టుపెట్టి, హారతులిచ్చి, మిఠాయిలు తినిపించి ఎళ్లవేళలా తమకు రక్షగా ఉండాలని ఆడపడుచులు (Raksha Bandhan 2023) రక్షాబంధనం కడితే.. వారి కష్ట సుఖాల్లో అండగా ఉంటానని సోదరులు నిండు మనస్సుతో ఆశీర్వదించే పండుగే రాఖీ. తోబుట్టువుకు రక్షాబంధనాన్ని కట్టేందుకు మహిళలు వ్యయ ప్రయాసలు లెక్క చేయక పుట్టింటికి చేరుకుంటారు. ఉద్యోగాలు, చదువుల రీత్యా దూరంగా ఉన్న వారికి రాఖీలు పంపించి ప్రేమను చాటుకుంటారు. సోదరి పట్ల వాత్సల్యాన్ని చెరగనీయకుండా కానుకలిచ్చి అన్నదమ్ములు సంతోషపడతారు.

Special Rakhis in Jagtial : వినూత్నంగా ఉండే రాఖీ కోసం చూస్తున్నారా..? అయితే ఇది ట్రై చేయండి..

Raksha Bandhan Celebrations Telangana : అనురాగానికి ప్రతీకైన పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. రాఖీల కొనుగోలు చేస్తున్న అతివలతో దుకాణాల వద్ద సందడి నెలకొంది. ఇంతకు ముందుతో పోలీస్తే రాఖీలు అనేక కొత్త రూపాలు సంతరించుకున్నాయి. మరోవైపు పోటీ పెరిగనప్పటికీ ఈ ఏడు వ్యాపారం బాగుందని దుకాణాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"తండ్రి తర్వాత అక్కాచెల్లెల్లకు అన్నదమ్ములే బలం. ఏ కష్టం వచ్చినా అన్న ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. ఈ పండుగ ద్వారా ఎన్ని గొడవలు ఉన్నా ఈరోజు అవన్నీ తొలగిపోయి అందరూ సంతోషంగా ఉంటారు. అన్నయ్య అంటే ఒక భద్రత. ఈ పండుగ వల్ల అది ఇంకా బలపడుతుంది." - ఓ సోదరి

Raksha Bandhan 2023 :రాఖీ పండుగపురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే వారితో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఈనెల 29, 30, 31 తేదీల్లో ఆర్టీసీ 3 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వీటితో పాటు 30, 31 తేదీల్లో ప్రయాణించిన మహిళలకు సుమారు 6 లక్షల విలువైన బహుమతులు గెలుచుకునేలా లక్కీ డ్రా ఏర్పాటు చేసింది.

Chandrayaan 3 Rakhi Trend : చంద్రయాన్-3 రాఖీలకు ఫుల్​ డిమాండ్​.. ధరను సైతం లెక్కచేయకుండా..

రాఖీ పండగ వేళ ఓ అవ్వ చేసిన పనికి నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లా కొత్తపల్లికి చెందిన 80 ఏళ్ల బక్కవ్వ బస్సు సౌకర్యం లేకపోవటంతో తమ్ముడి గ్రామానికి నడుచుకుంటూ వెళ్లి ప్రేమను చాటుకుంది. నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని ఓ పాఠశాలలో అంతరించిపోతున్న అడవులను కాపాడాలంటూ ఆవరణలోని చెట్లకు విద్యార్థులు రాఖీ కట్టారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వృక్ష రక్ష బంధు దివస్‌ నిర్వహించారు. తరాలు మారినా, యుగాలు మారిన మానవ సంబంధాలను పట్టి ఉంచే రాఖీ పండుగ ఎన్నటికీ వన్నె తగ్గనిదే.

Rakhi Celebrations at Shirdi Saibaba Temple: శిరిడీ సాయి ఆలయంలో రాఖీ వేడుకలు.. బాబాకు రాఖీ కట్టిన అర్చకులు

Celebrities Rakhi Celebration : అనుపమ​ టు మృణాల్​.. తోబుట్టువులతో అనుబంధాన్ని పంచుకున్నారిలా..

ABOUT THE AUTHOR

...view details