లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఎన్నికలకు 72 గంటల ముందు నుంచి ప్రొటోకాల్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రేపు సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం నిర్వహించకూడదని తెలిపారు. ఈనెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని, సమస్యాత్మక కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగుతుందన్నారు.
'పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి' - LOKSABHA
నిజామాబాద్‌లో ఉదయం 6 గంటల నుంచి 8 వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని, అనంతరం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఓటర్ కార్డుతో సహా మరో 11 గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు.
'పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'
రాష్ట్రవ్యాప్తంగా 34,604 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు రజత్‌కుమార్ వెల్లడించారు.
6,445 సమస్యాత్మక ఎన్నికల కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: హైదరాబాద్‌లో రూ.8 కోట్ల నగదు పట్టివేత