హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రాజాపేట చారిటబుల్ ట్రస్ట్ వారు 40 రోజులుగా అల్పాహారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ సభ్యులు చుక్కా రామయ్య పాల్గొన్నారు. విద్యార్థులకు అల్పాహారం అందించారు.
పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం - 10th exams news
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు చక్కగా చదువుకోవాలని సూచిస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు వారికి చేయూతనిస్తున్నాయి. రాజాపేట చారిటబుల్ ట్రస్ట్ ముషీరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు.
'ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి'
పరీక్షలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రతీ ఒక్కరూ ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శివాని అనే విద్యార్థిని తాను పోగు చేసుకున్న డబ్బుతో ప్రభుత్వ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు పెన్నులు అందించింది.