తెలంగాణ

telangana

ETV Bharat / state

Secretariat Opening: గవర్నర్​ను ఆహ్వానించినా రాలేదని ఆరోపణలు.. రాజ్​భవన్ స్పష్టత - Governor did not receive the invitation

RajBhavan Clarified on Governor Absence at Secretariat Opening: ఇటీవల జరిగిన నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా గవర్నర్​ను ఆహ్వానించినా.. రాలేదన్న ఆరోపణలపై రాజ్​భవన్ స్పష్టతనిచ్చింది. ఇంతకీ ఏమందంటే..?

Secretariat Opening
Secretariat Opening

By

Published : May 2, 2023, 7:18 PM IST

Raj Bhavan Clarified on Governor Absence at Secretariat Opening: రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం రాలేదని రాజ్​భవన్​ పేర్కొంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయానికి గవర్నర్​కు పిలువు రాలేదని రాజ్​భవన్​ వెల్లడించింది. సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినప్పటికీ గవర్నర్ రాలేదన్న ఆరోపణలను రాజ్​భవన్ తోసిపుచ్చింది. గవర్నర్​పై చేసిన ఆరోపణలు సత్యదూరం, ఆధార రహితమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదని స్పష్టం చేసింది. కేవలం ఆహ్వానం లేనందువల్లే సచివాలయ ప్రారంభానికి గవర్నర్ రాలేదని రాజ్​భవన్ తెలిపింది.

అంబేడ్కర్​ విగ్రహావిష్కరణకూ అందని ఆహ్వానం: ఇలానే గతంలో మరో ఘటన జరిగింది. డాక్టర్​ బీ.ఆర్.అంబేడ్కర్​ లాంటి మహోన్నత వ్యక్తి విగ్రహావిష్కరణకు.. రాష్ట్ర గవర్నర్‌గా తనకు ఆహ్వానం ఇవ్వలేకపోవడం ఆశ్చర్యంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​ అన్నారు. విగ్రహావిష్కరణకు తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చి ఉంటే కచ్చితంగా వెళ్లే ఆలోచనతో ఉన్నానని గవర్నర్ స్పష్టం చేశారు. ఆహ్వానం రానందున.. రాజ్​భవన్‌లోనే అంబేడ్కర్​కు నివాళులు అర్పించాల్సి వచ్చిందన్నారు.

ఘనంగా సచివాలయ ప్రారంభోత్సవం:నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్​ ఏప్రిల్​ 30న ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ పేరు పెట్టారు. ఈ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్​ సహా ప్రభుత్వ యంత్రాంగమంతా హాజరైంది. వీరందరి సమక్షంలో వేద పండితుల ఆశీర్వచనాలతో ఈ వేడుక వైభవంగా జరిగింది. ముందుగా సచివాలయంలో వేద పండితులతో సుదర్శన, చండీ, వాస్తు హోమాలు చేశారు. ఆ సమయంలో సచివాలయం మొత్తం మంత్రోచ్ఛారణలతో మారుమోగిపోయింది.

సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1:20 నిమిషాల నుంచి 1:32 నిమిషాల మధ్య నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సచివాలయం నాలుగు కోట్ల ప్రజానీకం ఆకాంక్షలను నెలవేర్చేలా ఆత్మగౌరవ ప్రతీకగా ఆధునికత, సంప్రదాయం, సాంకేతికత విరజిల్లేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ప్రారంభ వేడుక రోజు సీఎం కేసీఆర్ ఆరు దస్త్రాలపై సంతకం పెట్టారు. ఆ తరవాత అధికారులు వారి ఛాంబర్​లో వేరే వాటిపై సంతకాలు చేశారు. మధ్యాహ్నం సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్​ మాట్లాడారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details