తెలంగాణ

telangana

ETV Bharat / state

చెక్కులు కాదు మళ్లీ ఖాతాల్లోకే పైసలు - NOT

లోక్​సభ ఎన్నికల కోడ్​ రైతుబంధు చెక్కుల పంపిణీకి అడ్డంకిగా మారింది. శాసనసభ ఎన్నికల సమయంలో నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లుగానే ఖరీఫ్​ సీజన్​లోనూ నగదు బదిలీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది వ్యవసాయశాఖ.

మళ్లీ అకౌంట్​లోకే రైతుబంధు

By

Published : Mar 9, 2019, 11:50 AM IST

మళ్లీ అకౌంట్​లోకే రైతుబంధు
రానున్న ఖరీఫ్​లోనూ రైతుబంధు పథకం కింద చెక్కులకు బదులు కర్షకుల ఖాతాల్లోకి నగదు బదిలీ ప్రక్రియనే కొనసాగనుంది. గత అక్టోబరులో శాసనసభ ఎన్నికల కోడ్ దృష్ట్యా ఈ పథకం కింద రైతులకు చెక్కులు ఇవ్వవద్దని, నేరుగా బ్యాంకు ఖాతాకే నగదు జమ చేయాలని ఈసీ ఆదేశించింది. ఇక లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే మే నెల వరకూ ఉంటుంది. ఇప్పుడు కూడా నగదు బదిలీ చేయాల్సి వస్తుందన్న అంచనా మేరకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది.

సమాచార సేకరణలో అధికారులు..

ఇప్పటి వరకూ జరిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ తర్వాత ఉన్న తాజా వివరాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖను అడిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 52 లక్షల మందికి కొత్త పాసు పుస్తకాలు ఇచ్చినట్లు గుర్తించారు. ఇంకా పాసు పుస్తకాలు అందని రైతులు 3 లక్షల మంది పైగా ఉన్నారని తేల్చారు.

వారసుల పేరుతో ఉంటేనే....
గత ఏడాది ఖరీఫ్‌లో చెక్కులు ముద్రించిన తర్వాత కొందరు రైతులు కన్ను మూశారు. మృతుల వారసుల పేరిట భూ యాజమాన్య హక్కులు మారి కొత్త పాసు పుస్తకాలు పంపిణీ అయితేనే రైతుబంధు పథకం వర్తిస్తుంది. ఒకసారి రైతు పేరుతో చెక్కు ముద్రించిన తర్వాత అతను మరణిస్తే అదే చెక్కును వాసరులకు ఇవ్వడం కుదరదని, మళ్లీ నామినీ పేరు ముద్రించి ఇవ్వాలని వ్యవసాయ శాఖకు బ్యాంకులు స్పష్టం చేశాయి. రైతుబంధు, రుణమాఫీ పథకాల అమలుపై ఈ నెల 12న జరిగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో చర్చిస్తామని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి:లీటర్ పెట్రోల్ ఉచితం...మహిళ దినోత్సవ ఆఫర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details