కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో పూర్తిస్థాయి జాగ్రత్తలతో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అవసరమైన మేరకు పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోగా... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేశారు. నెగటివ్ ఉంటేనే సమావేశాలకు రావాలని స్పష్టం చేశారు. మొదటివారం పూర్తైన వెంటనే మరోమారు అందరికీ పరీక్షలు తప్పనిసరి చేశారు. ఆదివారం నుంచి పరీక్షలు చేస్తున్నారు.
పలువురికి కరోనా..
సోమవారం ఒక ఎమ్మెల్యే సహా పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. మంగళవారం కూడా మరికొంత మందికి వైరస్ నిర్ధరణ అయింది. సమావేశాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే పేషీల్లోనూ... కొందరికి కరోనా సోకింది. ఈ పరిస్థితుల్లో సమావేశాలను ముందుగానే ముగించాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వ బిల్లులు కూడా అన్నీ పూర్తయ్యాయి. ఈ మేరకు శాసనసభాపక్ష నేతలతో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశమై చర్చించారు.
నేడు మరోసారి చర్చ..