తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ పలు ప్రాంతాల్లో వర్షాలు - హైదరాబాద్ వర్షాలు

హైదరాబాద్​లో అక్కడక్కడ వర్షం పడుతోంది. నివర్ ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి జల్లులుపడుతున్నాయి. నగరంలో చలి పెరిగింది.

hyderabad rains
hyderabad rains

By

Published : Nov 28, 2020, 10:00 AM IST

నివర్‌ తుపాను ప్రభావంతో హైదరాబాద్​లో శుక్రవారం రాత్రి నుంచి వర్షం పడుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. నగరంలో చలి పెరిగింది. తీరం దాటిన తుపాను బలహీనపడిందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. బంగాళాఖాతం పశ్చిమ ప్రాంతంలో అల్పపీడనం ఉంది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది.

మరోవైపు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలో అండమాన్‌ దీవుల వద్ద మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆదివారానికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇది తీవ్ర వాయుగుండంగా మారి వచ్చే నెల 2 నాటికి తమిళనాడు, పుదుచ్చేరి తీరం వద్దకు వచ్చే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి :దారుణం: భర్తపై అనుమానంతో భార్య యాసిడ్‌ దాడి

ABOUT THE AUTHOR

...view details