రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్నగర్, వనపర్తి, నగర్కర్నూల్, జోగులాంబ గద్వాల్, వికారాబాద్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - వాతావరణం వార్తలు
రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురువొచ్చని చెప్పింది.
రేపు, ఎల్లుండి తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు
Last Updated : Jul 15, 2020, 4:59 PM IST