భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి చల్లగా ఉండి సాయంత్రం వాన పడింది. వర్షపు నీరు రోడ్డుపైకి రావడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడ్డారు. తూర్పు ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణ ఒడిశా వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన.. వాహనదారులకు ఇక్కట్లు - hyderabad latest news
ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షపు నీరు రోడ్డుపైకి రావడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన.. వాహనదారులకు ఇక్కట్లు