రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి ఇంటీరియర్ కర్ణాటక వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది.
రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి ఇంటీరియర్ కర్ణాటక వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో మధ్యస్త ట్రోపోస్పియర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడన ఏర్పడే అవకాశముందని ప్రకటించింది. ఇవాళ, రేపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 40 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందరి పేర్కొంది.
ఇదీ చూడండి:కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్ దాడులు