తెలంగాణ

telangana

ETV Bharat / state

నిసర్గ ఎఫెక్ట్: రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

బుధవారం మహారాష్ట్రలోని అలాబాగ్​ వద్ద తీరం దాటిన నిసర్గ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసి ఎండల తీవ్రత తగ్గిందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.

rainfall chances in telangana due to nisarga toofan
నిసర్గ ఎఫెక్ట్: రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

By

Published : Jun 4, 2020, 6:05 AM IST

అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుపాను బుధవారం మధ్యాహ్నం మహారాష్ట్రలోని అలీబాగ్​ వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో తెలంగాణలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. బుధవారం తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిశాయి.

అత్యధికంగా నాయుడుపేట( భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)లో 7.4, గొల్లపల్లి(జగిత్యాల జిల్లా)లో 3.2, హైదరాబాద్​ గన్​ఫౌండ్రీ వద్ద 2.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రాజారావు వెల్లడించారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 7 డిగ్రీల వరకు తగ్గి ఎండల తీవ్రత లేదన్నారు. గాలిలో తేమశాతం పెరిగినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:ముఖ్యమంత్రి కేసీఆర్​ కాన్వాయ్​కి ఓవర్​ స్పీడ్​ చలానాలు

ABOUT THE AUTHOR

...view details