Rain in Hyderabad: నగరవాసులకు ఉపశమనం.. పలు ప్రాంతాల్లో వర్షం - raining in many parts of Hyderabad
16:08 April 18
Rain in Hyderabad: భాగ్యనగరవాసులకు ఉపశమనం.. పలు ప్రాంతాల్లో వర్షం
Rain in Hyderabad: కొన్ని రోజులుగా సూర్యుడి భగభగలతో అల్లాడిపోతున్న రాజధాని వాసులకు ఒక్కసారిగా చిరుజల్లులతో ఉపశమనం లభించింది. హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో నగరవాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. నగరంలోని సూరారం, జీడిమెట్ల, గాజులరామారం, షాపూర్‌నగర్, బహదూర్‌పల్లి, కొంపల్లి, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్ ప్రాంతాల్లో వర్షం పడింది.
వర్షం పడడంతో వేసవి తాపం నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగినట్లైంది. రాష్ట్రంలోని అక్కడక్కడ రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: