రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే వీలుందని తెలిపింది.
రాగల మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు - తెలంగాణ తాజా వార్తలు
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు వడగండ్లతో పాటు ఈదురుగాలులతో కూడిన వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రేపు వడగండ్లతో పాటు ఈదురుగాలులతో కూడిన వాన కురిసే అవకాశం ఉదని పేర్కొంది. ఎల్లుండి ఉత్తర, తూర్పు, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ రోజు ఉపరితల ద్రోణి ఈశాన్య మధ్య ప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల నుంచి విదర్భ వరకు సముద్ర మట్టానికి 0.9కిలో మీటర్ల ఎత్తు వరకు ఏర్పడిందని.. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం దక్షిణ మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.