తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశవ్యాప్తంగా ప్రాణ వాయువును సరఫరా చేస్తోన్న రైల్వే - telangana news

మంగళవారం ఉదయంలోగా 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ గమ్యస్థానాలకు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తోన్న అన్ని విజ్ఞప్తులకు రైల్వే సకాలంలో స్పందిస్తోందన్నారు.

railways
దేశవ్యాప్తంగా ప్రాణ వాయువును సరఫరా చేస్తోన్న రైల్వే

By

Published : Apr 26, 2021, 11:41 PM IST

కరోనా చికిత్సలో కీలకమైన ఆక్సిజన్​ను దేశవ్యాప్తంగా సరఫరా చేసేందుకు రైల్వే కృషి చేస్తోంది. ఇప్పటి వరకు 302 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరో 154 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మార్గమధ్యలో ఉందని వెల్లడించారు.

మంగళవారం ఉదయంలోగా మొత్తం 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ గమ్యస్థానాలకు చేరుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తోన్న అన్ని విన్నపాలకు రైల్వే సకాలంలో స్పందిస్తోందని.. అదనపు ఆక్సిజన్ కోసం సంబంధిత అధికారులను తరచూ సంప్రదిస్తోందని ప్రకటించింది.

ఇదీ చూడండి:'ఆ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు​ అమలు చేయండి'

ABOUT THE AUTHOR

...view details