హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో పలువురు ట్రాక్ మ్యాన్స్ విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. కొంతకాలంగా సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అలోక్ కుమార్ తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, వేధిస్తున్నాడని ఆరోపించారు. కక్షసాధింపుగా వ్యవహరిస్తున్నాడని ఆవేదన చెందారు. ఈ ఉదయం తమపై వేధింపులు నిలిపివేయాలంటూ ఆందోళన చేపట్టారు. వీరికి పలు రైల్వే ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. అలోక్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అలోక్ కుమార్ వచ్చి క్షమాపణ చెప్పగా ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు.
ట్రాక్ మ్యాన్స్ ఆందోళన... అలోక్ కుమార్ క్షమాపణ - railway trackman's protest
ట్రాక్ మ్యాన్స్పై ఉన్నతాధికారుల వేధింపులు నిలిపివేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ డిమాండ్ చేసింది.

ట్రాక్ మ్యాన్స్ ఆందోళన... అలోక్ కుమార్ క్షమాపణ
ట్రాక్ మ్యాన్స్ ఆందోళన... అలోక్ కుమార్ క్షమాపణ
ఇదీ చూడండి : విపక్షాల సమావేశానికి కర్ణాటక సీఎం డుమ్మా