తెలంగాణ

telangana

ETV Bharat / state

raid on cinema theatres : కృష్ణా జిల్లాలో సినిమా థియేటర్లు సీజ్​.. కారణం అదే! - ఏపీ వార్తలు

raid on cinema theatres : ఏపీలోని కృష్ణా జిల్లా వ్యాప్తంగా సినిమా థియేటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించని సినిమా థియేటర్లను సీజ్ చేస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత స్పష్టం చేశారు.

raid on cinema theatres
raid on cinema theatres

By

Published : Dec 22, 2021, 7:31 PM IST

raid on theatres Krishna district : నిబంధనలు పాటించని 12 సినిమా థియేటర్లను సీజ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఏపీలోని కృష్ణా జిల్లా సంయుక్త పాలనాధికారి మాధవీలత తెలిపారు. జిల్లావ్యాప్తంగా సినిమా థియేటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. కరోనావ్యాప్తి అనంతరం.. చాలా థియేటర్లు లైసెన్సు​లను రెన్యూవల్ చేసుకోలేదని తనిఖీల్లో గుర్తించినట్లు ఆమె తెలిపారు.

అదేవిధంగా.. ప్రభుత్వ ఉత్తర్వుల కంటే అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న థియేటర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నిబంధనలు పాటించని సినిమా హాల్స్​పై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

raid in theatres Krishna district : గుడివాడలోని సినిమా థియేటర్లపై రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్డీవో శ్రీను కుమార్ ఆధ్వర్యంలో.. ఈ తనిఖీలు చేపట్టారు. థియేటర్లలో అమలవుతున్న టికెట్ రేట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మచిలీపట్నం రేవతి థియేటర్‌లో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాలతో ఆకస్మిక తనిఖీ చేశారు. థియేటర్‌లో టికెట్ విక్రయాలు, సౌకర్యాలు పరిశీలించారు. టికెట్‌ ధరల గురించి ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి:fake gold case in AP: పాత బంగారం దొరికిందని... 'కొత్త'గా మోసం చేశారు!

ABOUT THE AUTHOR

...view details