ETV Bharat / state
సబితా ఇంద్రారెడ్డికి రాహుల్ పిలుపు - ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ
మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. దిల్లీకి వచ్చి తనను కలవాల్సిందిగా కోరారు. సాయంత్రం ఆమె తనయునితో కలసి దిల్లీకి వెళ్లనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు
By
Published : Mar 12, 2019, 10:41 AM IST
| Updated : Mar 12, 2019, 12:37 PM IST
సబితా ఇంద్రారెడ్డికి ఫోన్ చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దిల్లీకి రావాలని కోరారు. సాయంత్రం సబిత ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి దేశ రాజధానికి పయనం కానున్నారు. వీరితోపాటు రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. ఇటీవల సబిత తెరాసలో చేరుతారన్న ఊహాగానాల నడుమ వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకోనుంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ రేపు భేటీ కానుంది. హస్తం నేతలు ఉత్తమ్, భట్టి విక్రమార్క సైతం దిల్లీకి వెళ్లనున్నారు. Last Updated : Mar 12, 2019, 12:37 PM IST