Rahul Gandhi Tour: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... రాష్ట్ర పర్యటన తేదీ ఖరారైంది. మే 6న సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ హజరవుతారని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్ ప్రకటించారు. మరుసటి రోజు మే 7న హైదరాబాద్‌లో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణలో రైతు వ్యవసాయ సమస్యలపై కాంగ్రెస్ సభ నిర్వహిస్తుందని మధుయాస్కీ పేర్కొన్నారు. వయో పరిమితిని పెంచే విధంగా కాంగ్రెస్ నిరుద్యోగులకు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.
'వచ్చే నెల 6వ తారీఖున వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజీలో రైతు సంఘర్షణ సభ జరుగుతుంది. ఆ సభకు రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సభలో రైతు సమస్యలపై, కేసీఆర్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, ధాన్యం కొనుగోళ్లు, భాజపా సర్కారు తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏ విధంగా పోరాడిందో ప్రజలకు చెబుతారు. రైతుల పక్షాన ఈ సభ జరగబోతోంది.'-మధుయాస్కీ గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్