తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసుల ఉచిత శిక్షణ... 33 మంది కలలను సాకారం చేసింది - ఉచిత శిక్షణ

తెలివితేటలు.. సాధించాలన్న పట్టుదల.. అన్నీ ఉన్నా ఆర్థిక పరిస్థితులు వారి ప్రయత్నానికి అడ్డు తగిలాయి. దీంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణా కేంద్రాలు వారి పాలిట వరంగా మారాయి. శిక్షణ తీసుకున్న 2501 మందిలో 33 మంది ఎస్సైలుగా, ఆర్ఎస్సైలుగా ఎంపికయ్యారు.

పోలీసుల ఉచిత శిక్షణతో 33 మంది ఎస్సైలయ్యారు

By

Published : Aug 29, 2019, 11:35 PM IST

పోలీసుల ఉచిత శిక్షణతో 33 మంది ఎస్సైలయ్యారు

పోలీసు కావాలనే ఆకాంక్ష ఉన్నా.. వారి కుటుంబ దీన స్థితి, ఆర్థిక పరిస్థితులు అడ్డంకులుగా మారాయి. తెలంగాణ ప్రభుత్వంలోని రాచకొండ పోలీసు కమిషనర్, పోలీసు సిబ్బంది అందించిన సహకారం, ప్రోత్సాహం 33 మంది జీవితాల్లో వెలుగు నింపింది. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను ప్రత్యేకంగా సీపీ మహేష్ భగవత్ సత్కరించారు. 2017లో ప్రారంభమైన ఈ ఉచిత పోలీసు శిక్షణలో మంచి ఫలితాలు వస్తున్నాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అంబర్‌పేట్, కార్ హెడ్ క్వార్టర్స్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్, బీబీనగర్, పహాడిషరీఫ్ ప్రాంతాల్లో ఆరు చోట్ల శిక్షణా శిబిరాల్లో శిక్షణ ఇచ్చారు.

ఉచిత శిక్షణ, భోజన సౌకర్యం

ఈ కేంద్రాలకు పీజేఆర్ కోచింగ్ సంస్థతోపాటు శ్రీ ఇందూ కాళాశాల, గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాలు సహకారం అందించాయి. సుమారు 1946 మంది ఉచిత శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఇందులో దాదాపు 1456 మంది అర్హత సాధించినా మెయిన్స్ వరకు వెళ్లి 33 మంది విజేతలుగా నిలిచారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ చొరవతో వీరికి ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. రాత పరీక్షతో పాటు దేహదారుఢ్య పరీక్షకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు కూడా భవిష్యత్తు తరానికి ఆదర్శంగా నిలిచి నిజాయితీతో పని చేసి సమాజాభివృద్ధికి కృషి చేస్తామని అభ్యర్థులు ప్రతిజ్ఞ చేశారు.

రాబోయే రోజుల్లో మరింత మందికి ..

కొంతమంది దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ముఖం చేటేస్తున్నారని, అలాంటి దళారుల మాటలను నమ్మి నిరుద్యోగ యువత మోసపోవద్దని రాచకొండ సీపీ సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పరీక్షలు ఉంటాయని, అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా తీసుకొని మాత్రమే ఉద్యోగాలు ఇస్తారని సీపీ పేర్కొన్నారు.

త్వరలో విడుదల కానున్న కానిస్టేబుల్ ఫలితాల్లో శిక్షణ తీసుకున్న వారు మంచి ఫలితాలు సాధస్తారని సీపీ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరింత మంది ఉద్యోగాలు సాధించేలా చేయడమే తమ లక్ష్యమని సీపీ మహేష్ భగత్ తెలిపారు.

ఇదీ చూడండి : కదిలే రైలు నుంచి దిగబోయాడు.. అంతలోనే!

ABOUT THE AUTHOR

...view details