లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఇతర రాష్ట్రాల కూలీలకు పోలీసులు ఆహారం పంపిణీ చేశారు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్లాపూర్, నాచారం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆహార పంపిణి కేంద్రాలను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రారంభించారు. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు, వారి కుటుంబ సభ్యులు సుమారు 2,500 మంది ఈ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వీళ్లందరికి రోజు భోజనం అందించనున్నట్లు మహేశ్ భగవత్ తెలిపారు.
పక్క రాష్ట్రాల కూలీలకు ఆహారం పంపిణీ
హైదరాబాద్లో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఇతర రాష్ట్రాల కూలీలకు రాచకొండ పోలీసులు ఆహారం పంపిణీ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్లాపూర్, నాచారం, ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో సుమారు 2 వేల 500 మంది నివాసం ఉంటున్నట్లు.. వారందరికీ రోజు భోజనం అందించనున్నట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పేర్కొన్నారు.
పక్క రాష్ట్రాల కూలీలకు ఆహారం పంపిణీ
జ్వాలా యోగి ట్రస్ట్, హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆహార పంపిణీ కేంద్రాలను పోలీసులు నిర్వహిస్తున్నారు. భోజనం లభించక ఎవరైనా ఇబ్బందులు పడితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని మహేశ్ భగవత్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:దేశంలో 1400కు చేరువలో కరోనా కేసులు.. 35 మంది మృతి