తెలంగాణ

telangana

By

Published : Dec 30, 2020, 12:32 PM IST

ETV Bharat / state

'ఈ లఘు చిత్రం మహిళల్లో ధైర్యాన్ని పెంపొందిస్తుంది'

పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ అన్నారు. శశాంక్ రామానుజం దర్శకత్వం వహించిన 'అమ్మాయి' అనే లఘు చిత్రాన్ని ఆయన హైదరాబాద్​లోని ప్రసాద్​ ల్యాబ్స్​లో విడుదల చేశారు.

Rachakonda cp told ammai  short film induced by the courage of women
'ఈ లఘు చిత్రం స్త్రీలలో ధైర్యాన్ని ప్రేరేపిస్తుంది'

మహిళలు ధైర్యంగా ఉండటంతోపాటు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం ద్వారా వారిలో బలం, విశ్వాసం అభివృద్ధి చెందుతాయని రాచకొండ పోలీస్‌ కమీషనర్‌ మహేష్‌ భగవత్‌ అన్నారు. శశాంక్ రామానుజం దర్శకత్వం వహించిన 'అమ్మాయి' అనే లఘు చిత్రాన్ని ఆయన హైదరాబాద్​లోని ప్రసాద్​ ల్యాబ్స్​లో విడుదల చేశారు.

'అమ్మాయి' అనే లఘు చిత్రం స్త్రీలలో ధైర్యాన్ని ప్రేరేపిస్తుందని సీపీ మహేష్​ భగవత్​ అన్నారు. ఎవరైనా మహిళల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే ధైర్యంగా ఎదుర్కొనేలా వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. బ్యూటిఫుల్ లైఫ్, మరోలోకం లాంటి సమాజ హిత లఘు చిత్రాలను రూపొందించిన దర్శకుడు శశాంక్ రామానుజన్​ను సీపీ ప్రశంసించారు.

ఆపదలో ఉన్న వారు డయల్ 100కు ఫోన్ చేస్తే కేవలం ఏడున్నర నిమిషాల లోపు పోలీసులు ప్రతిస్పందిస్తారని రాచకొండ సీపీ మహేష్​ భగవత్​ అన్నారు. రాచకొండ కమిషనరేట్​ పరిధిలో షీ ఫర్ హర్, మార్గదర్షక్ అనే కార్యక్రమాల ద్వారా మహిళల రక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:విడతల వారీగా అందరికీ కరోనా వ్యాక్సిన్: దత్తాత్రేయ

ABOUT THE AUTHOR

...view details