రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నందున రాత్రి 8 గంటలకే దుకాణాలు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు మూసివేయాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ విజ్ఞప్తి చేశారు. సరుకు రవాణా చేసే వాహనాలకు అనుమతి ఉందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయించిన సంస్థలు, కార్యాలయాలు తప్ప అన్ని మూసివేయాల్సి ఉందని వెల్లడించారు.
రాత్రి కర్ఫ్యూ పక్కాగా అమలు చేస్తాం: రాచకొండ సీపీ - telangana varthalu
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రి వేళ కర్ఫ్యూ పక్కాగా అమలు చేస్తామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. 8 గంటల లోపే దుకాణాలు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు మూసివేయాలని కోరారు.
రాత్రి కర్ఫ్యూ పక్కాగా అమలు చేస్తాం: రాచకొండ సీపీ
అనుమతి లేని వారెవరైనా రాత్రి కర్ఫ్యూ సమయంలో తిరిగినట్లయితే వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు. ఇవాళ్టి నుంచి మే ఒకటో తేదీ ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ ఉంటున్నందున ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ