చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం దీనబంధుపురం గ్రామానికి చెందిన రైతు చంద్రానికి చెందిన చెరకుతోటలో కొండచిలువ కనిపించింది. ఆ భారీ సర్పాన్ని చూసిన కూలీలు భయాందోళనకు గురై అరుస్తూ పరుగులు తీశారు. పొలంలో కొండచిలువ ఉందన్న సమాచారం తెలుసుకున్న గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని జాయి తోటలోకి ప్రవేశించి ఆ భారీ సర్పాన్ని బయటకు లాగారు.
కొండచిలువ... అయితే నాకేం భయం.. - కొండచిలువ... అయితే నాకేం భయం..
అది 8 అడుగుల కొండచిలువ. దాన్ని దూరం నుంచి చూస్తేనే గుండెలదిరిపోతాయి. ఇక దగ్గరికొస్తుంటే ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీస్తాం. అలాంటిది ఆ భారీ సర్పాన్ని ఓ మహిళ చేత్తో పట్టుకుని బయటకు లాగింది. చెరకుతోటలో ముడుచుకుని పడుకున్న కొండచిలువను ధైర్యంగా పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించింది.
కొండచిలువ... అయితే నాకేం భయం..
ఒక యువకుడి సహాయంతో 8 అడుగుల పొడవున్న చిలువను తోట బయటకు తీసుకొచ్చారు. అనంతరం దాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కొండచిలువ విష సర్పం కాదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయి గ్రామస్థులకు ధైర్యం చెప్పారు.
ఇవీ చదవండి..గ్రామానికి వచ్చిన హీరోయిన్లు... ఎక్కడో తెలుసా..!