దేశ రక్షణ రంగం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహం కార్టోశాట్-3ప్రయోగం విజయవంతమైంది.దేశంలోకి చొరబడే ఉగ్రవాదులను పసిగట్టడంతోపాటు వారి కదలికలు,స్థావరాలపై నిఘా నేత్రంలా పనిచేసే ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా రోదసీలోకి పంపింది.శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ల్యాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం9గంటల28నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ47వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.
పీఎస్ఎల్వీ-సీ47...కార్టోశాట్-3తో పాటు అమెరికాకు చెందిన మరో13నానో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది.ఈ మొత్తం ప్రక్రియ27నిమిషాల్లోనే పూర్తయింది.ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన26గంటల కౌంట్‌డౌన్...మంగళవారం ఉదయం7గటంల28నిమిషాలకు ప్రారంభమై....ఇవాళ ఉదయం9గంటల28నిమిషాలకు ముగిసింది.
కార్టోశాట్-3బరువుసుమారు16వందల25కేజీలు.మూడో తరానికి చెందిన ఈ భూ పరిశీలన ఉపగ్రహన్ని....హై రెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.ఐదేళ్ల పాటు కార్టోశాట్-3సేవలందించనుంది.పట్టణ అభివృద్ధి ప్రణాళిక,గ్రామీణ వనరులు, మౌలిక వసతుల అభివృద్ధి, తీరప్రాంత వినియోగంలో ఈ ఉపగ్రహం సేవలందించనుంది. దీనితో పాటు..... ఉగ్రవాద శిబిరాలపై కూడా నిఘా ఉంచుతుంది.