పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన తెలుపుతామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈనెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు వ్యక్తం చేస్తామని తెలిపారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి ఉత్తమ్ మాట్లాడారు.
పెట్రో ధరలకు నిరసనగా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు: ఉత్తమ్ - పెట్రో ధరలకు నిరసనగా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు: ఉత్తమ్
గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేస్తామని తెలిపారు.
పెట్రో ధరలకు నిరసనగా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు: ఉత్తమ్
లాక్డౌన్ సమయంలో పేద కుటుంబాలకు విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన పాత్రికేయుల కుటుంబాలకు రూ.50 లక్షలు చెల్లించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.