తెలంగాణ

telangana

ETV Bharat / state

'మా వాడ ముద్దు.. వైన్స్​ షాప్ వద్దు' - చిలకలగూడలోని అమృత వైన్స్ ఎదుట  స్థానికులు నిరసన

మద్యం దుకాణాలపై ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఇళ్ల మధ్య వైన్​ షాపులను పెట్టడాన్ని నిరసిస్తున్నారు. సికింద్రాబాద్​ చిలకలగూడ అమృత వైన్స్​ ఎదుట స్థానికులు ధర్నా చేపట్టారు. మందుబాబుల ఆగడాలు తట్టుకోలేక పోతున్నామని ఆరోపించారు. అక్కడినుంచి షాపులు తీసేయాలని.. మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకూడదని కోరారు.

'మా వాడ ముద్దు.. అమృత్​ వైన్స్​ వద్దు'

By

Published : Nov 1, 2019, 2:31 PM IST


జనవాసాల్లో మద్యం దుకాణాలు పెడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సికింద్రాబాద్​ చిలకలగూడ వాసులు వైన్స్​ ఎదుట ఆందోళనకు దిగారు. అమృత వైన్స్ ఎదుట స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఇళ్లు, అపార్ట్​మెంట్​ల మధ్యలో లిక్కర్​ షాపులకు ప్రభుత్వం అనుమతిస్తూ ప్రజలకు భద్రత, రక్షణ లేకుండా చేస్తుందని ఆరోపించారు. వైన్​ షాపులను శివారు ప్రాంతాల్లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

సాయంత్రం మందుబాబుల ఆగడాలు శృతిమించడం వల్ల పాఠశాల నుంచి వచ్చే విద్యార్థులకు, మహిళలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని స్థానికులు వాపోయారు. మద్యం తాగి అక్కడే మలవిసర్జన చేస్తునందున.. ఇళ్లల్లో నివసించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మందుబాబుల చేష్టలు భరించలేకపోతున్నామని.. ఇక్కడినుంచి వైన్​ షాపులను తొలగించాలన్నారు. మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకూడదని చిలకలగూడ వాసులు కోరారు.

'మా వాడ ముద్దు.. అమృత్​ వైన్స్​ వద్దు'

ఇవీ చూడండి: పెళ్లి మండపంలో ముష్టియుద్ధం

ABOUT THE AUTHOR

...view details